![]() |
![]() |
.webp)
ఈ వారం జబర్దస్త్ లో నాగబాబు జడ్జిమెంట్ మొత్తం కూడా నెగటివ్ గానే ఉంది. ఐతే ఇంద్రజ సూపర్, అద్దిరిపోయింది అంటూ కామెంట్స్ ఇచ్చింది. బులెట్ భాస్కర్ అండ్ టీమ్ వాళ్ళది ప్రామిసింగ్ స్కిట్ అని ఇంద్రజ చెప్తే నాగబాబు దానికి నెగటివ్ గా చెప్పారు. "భాస్కర్ నువ్వు స్ట్రాంగ్ కంటెండర్ వి. నీ స్కిట్స్ బాగుంటాయి కానీ కానీ నీ స్టాండర్డ్ కి ఈ స్కిట్ అంత రీచ్ కాలేదు. నీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నాటీ నరేష్, ఫైమా, ధరణి, శాంతి స్వరూప్ ఉన్నారు. ఈ స్కిట్ ఓకే కానీ అంత గొప్పగా అనిపించలేదు. ఆర్టిస్టులుగా నెక్స్ట్ మంచి స్కిట్ చేయాలి" అని చెప్పారు. తర్వాత రాకెట్ రాఘవ స్కిట్ కి "సూపర్ గా చేసారంటూ" ఇంద్రజ చెప్పింది.
ఇక నాగబాబు ఐతే "గుడ్ స్కిట్ బాగా ఎంటర్టైన్ చేశారంతా. ఐతే కొన్ని సార్లు డైలాగ్స్ క్లాష్ అవుతున్నాయి. ఎవరు పంచ్ వేసినా రిజిస్టర్ అవడం లేదు. రిహార్సల్స్ లో ఎక్కడో సరిగ్గా చేయడం లేదు అనిపిస్తోంది. కాబట్టి రిహార్సల్స్ గట్టిగా చేయండి" అని చెప్పారు. ఇక ఫైనల్ గా ధనరాజ్ స్కిట్ విషయంలో ఇంద్రజ మాట్లాడుతూ "స్కిట్ చాల బాగుంది.
కానీ ఇంకా మంచి స్కిట్స్ ని మీ నుంచి ఆశిస్తున్నాం" అని చెప్పింది. ఇక నాగబాబు ఐతే "ధనరాజు నిజాయితీగా చెప్పాలంటే నీ మేజిక్ వర్కౌట్ అవలేదు. ఏదో ఒక మేజిక్ ఉంటుంది. ఎలాంటి కంటెంట్ ని ఐనా నువ్వు మేజిక్ చేస్తావు. ఈసారి ఆరా పని చేయలేదు. నెక్స్ట్ స్కిట్ ఇరగ్గొట్టాలి. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం" అని చెప్పారు.
![]() |
![]() |